సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

సీఎం రేవంత్ రెడ్డిని జి.హెచ్.ఎం.సీ. మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న

By Medi Samrat  Published on  3 Feb 2024 12:30 PM GMT
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

సీఎం రేవంత్ రెడ్డిని జి.హెచ్.ఎం.సీ. మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా జనరల్ బాడీ మీటింగ్ పై చర్చ జరిపినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ రాకముందే బల్దియా బడ్జెట్ ప్రవేశపెట్టాలని కోరారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ప్రత్యేకంగా పురపాల శాఖ మంత్రి లేకపోవడం, ఆ శాఖకు బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో మరింత చొరవ చూపాలని ఆమె కోరారు.

గత ఐదు నెలలుగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు పెండింగ్లో ఉందని, నవంబర్లో అమలులోకి వచ్చిన ఎన్నికల నియమావళి ఇందుకు అడ్డంకిగా మారిందన్నారు విజయలక్ష్మి. దీంతోపాటు ఆగస్టులో జరగవలసిన జిహెచ్ఎంసి జనరల్ బాడీ సమావేశం కూడా ఇంకా పెండింగ్లో ఉందన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్రాస్ కి పలుసార్లు ఆదేశాలు జారీ చేశామని, అయితే ఈ అంశంలో ప్రభుత్వ సూచనల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారని సీఎంకు వివరించారు. ఈ అంశంలో కలుగజేసుకొని వెంటనే జిహెచ్ఎంసి పరిపాలన సజావుగా సాగడానికి ఆదేశాలు జారీ చేయాలని గద్వాల విజయలక్ష్మి కోరారు. మరోసారి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ అంశంలో వేగంగా స్పందించాలని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వలన నగరంలో తమ తమ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిహెచ్ఎంసి కార్పొరేటర్ల నుంచి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటుకు తీవ్రమైన ఒత్తిడి ఉందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ అంశం పైన తీసుకోవాల్సిన చర్యలన్నింటిని వెంటనే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story