అమీర్‌పేట్‌లో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌.. భయంతో జనం పరుగులు

Man with pistol creates ruckus in Ameerpet, arrested. హైదరాబాద్‌ నగరంలో ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. తుపాకీ చూపిస్తూ రోడ్డుపై వెళ్లే పాదచారులు,

By అంజి  Published on  9 Nov 2022 8:01 AM GMT
అమీర్‌పేట్‌లో తుపాకీతో వ్యక్తి హల్‌చల్‌.. భయంతో జనం పరుగులు

హైదరాబాద్‌ నగరంలో ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ చేశాడు. తుపాకీ చూపిస్తూ రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను భయపెట్టాడు. స్థానికులు వెంటనే దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేట బిగ్‌బజార్‌ వద్ద సాయికుమార్ అనే వ్యక్తి తుపాకీతో వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

బిగ్ బజార్ ప్రాంతంలో తిరుగుతూ స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సాయికుమార్‌ గన్‌ చూపిస్తూ భయపెట్టడంతో.. రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను హడలిపోయారు. సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతడి నుంచి తుపాకీని, ఆరు బులెట్లు స్వాధీనం చేసుకున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హరిశ్చాంద్రారెడ్డి తెలిపారు.


Next Story