మానసిక స్థితి సరిగా లేని మహిళపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు
Man gets lifer for raping mentally unstable woman. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగలేడం లేదు.
By Medi Samrat Published on
18 Feb 2022 11:36 AM GMT

ఎన్ని కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగలేడం లేదు. వయస్సు, మానసిక స్థితితో సంబంధం లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు ఆఘాయిత్యాలకు బలవుతూనే ఉన్నారు. 2013లో మీర్‌పేటలో మానసిక స్థితి సరిగా లేని మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి స్థానిక కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
మే 2013లో సరూర్‌నగర్‌కు చెందిన పెయింటర్ షేక్ బాబా (36).. తన సోదరి మరియు మేనల్లుళ్లతో కలిసి డాబాపై నిద్రిస్తున్న 28 ఏళ్ల బాధితురాలిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె కుటుంబ సభ్యులు ఏమి జరిగిందో గ్రహించి షేక్ బాబాను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే అతను అక్కడి నుండి పారిపోయాడు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ కేసులో నేడు తీర్పు వెలువడింది.
Next Story