ప్రగతి భవన్ ముందు యువకుల హంగామా

Man Attempts Suicide At Pragathi Bhavan. సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది స‌మ‌యం ముందు

By Medi Samrat  Published on  8 Jun 2021 11:07 AM GMT
ప్రగతి భవన్ ముందు యువకుల హంగామా

సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది స‌మ‌యం ముందు ప్రగతి భవన్ వద్ద ఇద్దరు అన్నదమ్ములు కలకలం సృష్టించారు. వారిలో ఓ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.


ఆ వ్యక్తి సోదరుడు మంత్రి హరీష్ రావు కాన్వాయ్ మీదకు వెళ్లేందుకు యత్నించాడు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిది కొంపల్లిగా గుర్తించారు. కాగా, ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు యత్నించామని ఆ అన్నదమ్ములు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన తమనే పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించిన‌ట్లు స‌మాచారం.Next Story