హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రశాంతంగా ఉన్న రోడ్డు కాస్తా మహిళ అరుపులు, రక్తంతో క్రైమ్ సీన్ ను తలపించింది. దీంతో స్థానికులు అక్కడ ఏమి జరుగుతోందా అని టెన్షన్ పడ్డారు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళ చనిపోయిందని భావించిన నిందితుడు ఖలీల్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు. తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఖలీల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. నడిరోడ్డు మీద మహిళపై కత్తిదాడి చూసి స్థానికులు భయందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.