Alert : హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు బంద్‌.. కార‌ణ‌మిదే..!

హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌లు మినహా అన్ని ఫ్లైఓవర్‌లు మూత‌ప‌డ‌నున్నాయి.

By -  Medi Samrat
Published on : 16 Jan 2026 3:39 PM IST

Alert : హైదరాబాద్‌లో ఫ్లైఓవర్‌లు బంద్‌.. కార‌ణ‌మిదే..!

హైదరాబాద్‌లోని గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌లు మినహా అన్ని ఫ్లైఓవర్‌లు మూత‌ప‌డ‌నున్నాయి. షబ్-ఎ-మెరాజ్ సంద‌ర్భంగా జనవరి 16-17 మధ్య రాత్రి అన్ని ఫ్లైఓవర్‌లు మూత‌ప‌డ‌నున్నాయి.

హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమీషనర్ డి జోయెల్ డేవిస్ ప్రకారం.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి, రహదారి భద్రతా ప్రమాణాలను పాటించేలా చూడడానికి నెక్లెస్ రోడ్‌తో సహా చాలా ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు.

అదనంగా తెలంగాణ తల్లి, షేక్‌పేట్, మన్మోహన్ సింగ్, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్‌లను కూడా అవసరమైతే మూసివేయ‌నున్నారు. జనవరి 16వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లు మూత‌ప‌డ‌నున్నాయి.

X, Facebook సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రసారం చేయబడిన తాజా ట్రాఫిక్ అప్‌డేట్‌లను అనుసరించాలని నగర పోలీసులు వాహ‌న‌దారుల‌ను కోరారు. ఏదైనా ప్రయాణ అత్యవసర పరిస్థితి లేదా సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్ర‌దించ‌వ‌చ్చు. పౌరులు ట్రాఫిక్‌ మళ్లింపులను గమనించి, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అభ్యర్థించారు.

ఇదిలావుంటే.. జగ్నే కి రాత్ అని కూడా పిలువబడే షబ్-ఎ-మెరాజ్.. ఇస్లామిక్ నెల రజబ్ యొక్క 27వ రోజున జరుపుకుంటారు.

Next Story