బైక్‌ని గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్

పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టింది ఓ లారీ. ఆ లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపాడు డ్రైవ

By Medi Samrat  Published on  17 April 2024 2:45 PM GMT
బైక్‌ని గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్

పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టింది ఓ లారీ. ఆ లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపాడు డ్రైవర్. బ్యానెట్ ‌పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు ఆ బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో లారీ ఆగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు

ప్ర‌ధాన ర‌హ‌దారిపై వెళ్తున్న తన బైక్‌ను లారీ ఢీకొట్టిందని.. నెమ్మ‌దిగా న‌డ‌పాల‌ని లారీ డ్రైవ‌ర్‌కు సూచిస్తే అతడు కోపం పెంచుకుని ఈ పని చేశాడని బాధితుడు వాపోయాడు. డ్రైవ‌ర్‌తో వాగ్వాదానికి దిగి బైక‌ర్ లారీ బ్యానెట్‌పైకి ఎక్కాడు. దీంతో మ‌రింత ఆగ్ర‌హానికి గురైన డ్రైవ‌ర్ లారీని స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు. మ‌రోసారి బైక్‌ను ఢీకొట్టాడు డ్రైవ‌ర్. బాధిత యువ‌కుడు లారీ డోర్‌లో వేలాడుతూ ఉండగా.. వేగంగా రెండు కిలోమీట‌ర్లు ఆప‌కుండా ముందుకు లారీని పోనిచ్చాడు. చిన్న పొరపాటు జరిగినా లారీ కింద పడో.. లేక రోడ్డు మీద వస్తున్న మరిన్ని వాహనాల కిందో పడి బైకర్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అదృష్టవశాత్తూ అతడికి ఏమీ జరగలేదు. రోడ్డుపై వెళుతున్న ఇతర వ్యక్తులు ఈ ఘటనను రికార్డు చేశారు.

Next Story