గోల్ కొట్టిన సీఎం రేవంత్‌.. మెస్సీ కూడా..

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ అత‌ని స‌హ‌చ‌రులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు.

By -  Medi Samrat
Published on : 13 Dec 2025 9:51 PM IST

గోల్ కొట్టిన సీఎం రేవంత్‌.. మెస్సీ కూడా..

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ అత‌ని స‌హ‌చ‌రులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లతో కలిసి శనివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియంలో స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. GOAT టూర్‌లో భాగంగా తొలుత‌ కోల్‌కతాలో మెస్సి ప‌ర్య‌టించ‌గా అక్క‌డ‌ గందరగోళం నెల‌కొంది. దీంతో తెలంగాణ పోలీసులు విస్తృతమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో హైదరాబాద్ ఈవెంట్ సజావుగా, ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగింది.

ఈ మ్యాచ్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోల్ చేశారు. మ‌రోవైపు ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కూడా రెండు గోల్స్ కొట్టారు. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరఫున రేవంత్ రెడ్డి ఆడ‌గా.. అపర్ణ జట్టు తరఫున లియోనల్ మెస్సీ బ‌రిలోకి దిగారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో వీరిద్దరూ బరిలో దిగారు. రేవంత్ రెడ్డి వచ్చీ రావడంతోనే గోల్ కొట్టి అలరించారు. మ్యాచ్ అనంత‌రం సీఎం రేవంత్ మెస్సీకి మెమెంటోను అంద‌జేశారు.

ఇదిలావుంటే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లతో కలిసి రేవంత్ రెడ్డి, మెస్సీ ఫొటోలు దిగారు. ఇద్దరూ స్టేడియంలో కలియతిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కుమారుడు, కుమార్తె ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించారు.

Next Story