హైదరాబాద్ నగరం లంగర్ హౌజ్ లేక్‌లో తండ్రీకొడుకులు మునిగి చనిపోయారని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ కార్మికుడు కరీం(42) తన కుమారుడు సాహిల్ తో కలిసి లంగర్ హౌజ్ వద్దకు సరస్సులో క్లీనింగ్ పనులు చేయడానికి వెళ్లాడు. అనంతరం ఇద్దరూ లంగర్ హౌజ్ సరస్సు వద్దకు వచ్చి నీటిలోకి దిగారు.
సాహిల్ చెరువుని శుభ్రం చేసే క్రమంలో సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బురదలో ఇరుక్కుపోయాడు. తన తండ్రిని సహాయం కోరడంతో తండ్రి వెళ్లి కొడుకు చేయిపట్టే క్రమంలో ఇద్దరూ బురదలో ఇరుక్కుపోయారు. ఇద్దరూ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. డిఆర్ఎఫ్ టీమ్ ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలని వెలికి తీసింది. "వారు ఈతకు వెళ్లి సరస్సులో మునిగిపోయారని మేము తెలుసుకున్నాము" అని గోల్కొండ ACP, సయ్యద్ ఫైజ్ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.