జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్
జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
By - Knakam Karthik |
జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది: కేటీఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ధర్మం బీఆర్ఎస్ వైపు ఉంది..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్..కారు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నిక.. అని పేర్కొన్నారు. గత ఎన్నికలో కాంగ్రెస్ నుంచి అజహారుద్దీన్ పోటీ చేశారు. అజహారుద్దీన్‌కు ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడదు, ఆ విషయం రేవంత్ కూడా తెలుసు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. హైడ్రా బుల్డోజర్ ఇంటికి రావటం ఖాయం. మోస పోతే.. ప్రజలు ఘోస పడతారు, గోపీనాథ్ కుటుంబం అనాధ కాదు.. వారికి అందరం అండగా ఉంటాం.
తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో రేవంత్ రెడ్డిని ప్రజలు అన్ని తిట్లు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి మాదిరి గలీజ్ భాష మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలో లేరు. రేవంత్ రెడ్డి దొంగ కాబట్టి.. దొంగ అని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ మోసాలను బాకీ కార్డులతో ప్రతి ఒక్కరికి వివరించాలి. ఒక్కొక్కరికి కాంగ్రెస్ ఎంత బాకీ పడిందో..ప్రతి వ్యక్తి కలసి బాకీ కార్డు ఇవ్వాలి. కాంగ్రెస్‌ను హైదరాబాదీలు నమ్మలేదు, అందుకే ఎన్నికలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఇళ్ళు కూలగొట్టడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే..అని కేటీఆర్ ప్రశ్నించారు.