ఎల్‌బీనగర్ క్రాస్‌రోడ్‌లో అండర్‌పాస్ వంతెనను, బైరామల్‌గూడలో ఫ్లైఓవర్‌ను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. అలాగే నాగోలు, బండ్లగూడలో నాలా అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం రూ.103 కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపట్టిందని మంత్రి తెలిపారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని.. ఎల్‌బీ నగర్‌లోని భూముల రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రెండు, మూడు నెలల్లో కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించిన మంత్రి.. అభివృద్ధి చేసేందుకు బీజేపీ కార్పొరేటర్లు కూడా ముందుకు రావాలని కోరారు. ఎల్‌బీ నగర్ అండర్‌పాస్‌ను రూ. 40 కోట్లతో నిర్మించగా, బైరామల్‌గూడలో ఫ్లైఓవర్‌ను రూ. 29 కోట్లతో హెచ్‌ఎండీఏ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి) కింద నిర్మించారు.