సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు తీగుళ్ల పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు శనివారం నాడు ప్రకటించారు. పార్టీ సమావేశంలో చర్చించి ముఖ్య నేతలందరి అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పద్మారావు గౌడ్. సికింద్రాబాద్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన నేతగా ఆయనకు మంచి పేరుంది. ఆ ప్రాంత ప్రజలు ఆయనను ‘పజ్జన్న’గా పిలుస్తారు. పద్మారావు గౌడ్‌నే అభ్యర్థిగా ప్రకటించాలని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు.