హీరో నితిన్‌ను కలిసిన నడ్డా
JP Nadda Meets With Nithin. తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్
By Medi Samrat Published on
27 Aug 2022 2:39 PM GMT

తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్ ను కలిశారు. ఇక ఇప్పటికే మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ను కూడా నడ్డా కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జేపీ నడ్డాతో భేటీ కాబోయే ప్రముఖుల జాబితాలో టీవీ9, మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిశాక ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.
Next Story