హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడుల కలకలం

IT Raids In Hyderabad. హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడుల కలకలం మొదలైంది. నగరవ్యాప్తంగా దాదాపు

By Medi Samrat
Published on : 24 May 2023 10:25 AM IST

హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడుల కలకలం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడుల కలకలం మొదలైంది. నగరవ్యాప్తంగా దాదాపు 20 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్‌తో పాటు రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. కోహినూర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ మజీద్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం అందింది. మాదన్నపేట్, కొండాపూర్, మైదిపట్నం, శాస్త్రిపురం తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదన్నపేట రామచంద్ర నగర్ లోని కోహినూర్ డెవలపర్స్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో ఐటి సోదాలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. వారి ఆదాయానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కోహినూర్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పలు ప్రభుత్వ భూముల్లో కోహినూర్ గ్రూపు వెంచర్లు కూడా వేసింది. ఈ సంస్థ ఓ పొలిటికల్ లీడర్ కు చెందినదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story