చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌

మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు అరెస్ట్‌కు మద్దతుగా మ‌రోమారు ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌ల‌కు

By Medi Samrat  Published on  14 Sept 2023 5:19 PM IST
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌

మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుకు అరెస్ట్‌కు మద్దతుగా మ‌రోమారు ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా హైటెక్ సిటీ వ‌ద్ద‌ ఆందోళనకు సిద్ధమయ్యారు. అయితే అప్ప‌టికే అక్క‌డ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అయితే.. ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో సైబర్ టవర్ వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే సైబర్‌ టవర్ పరిసరాల్లో యువత ఐడీలను పోలీసులు చెక్ చేశారు. ఐటీ ఉద్యోగి అయితే కార్యాలయాల్లోకి వెళ్లిపోవాలంటూ సూచించారు. అయితే.. చంద్రబాబుకు మద్దతుగా వస్తున్న వారిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుంటుండ‌గా ఓ మహిళా కానిస్టేబుల్ తలకు గాయం అయ్యింది. ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగులను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

Next Story