ప్రస్తుత కాలం సోషల్ మీడియా కాలం. ఎవరు ఎలా ఉంటారో చెప్పలేని దుస్థితి. సోషల్ మీడియాలో పరిచయం అయినా వారిని నమ్మి కొందరు లక్షలు లక్షలు పోగొట్టుకుంటుంటారు. ఆన్‌లైన్ స్నేహాలు, మోసాలు బాగా పెరిగిపోయాయి. తాజాగా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయినా ఇన్‌స్టాగ్రామ్ పరిచయం దొంగలను ఏకంగా ఇంటికి చేర్చింది. ఇంకేముంది.. ఇళ్లంతా దోచేయాలని చూశారు.. కానీ అలెర్ట్ అయినా పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని వనస్థలిపురంలో స్వచ్చంద హెల్ప్ కిడ్స్ హ్యాపీ కిడ్స్ అనే సంస్థ నడిపే సతీష్‌కు కర్ణాటకకు చెందిన నిఖిల్ అనే వ్యక్తి ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. అనంతరం మంచి మాటలతో అతని ఆర్ధిక లావాదేవీల గురించి తెలుసుకున్న నిఖిల్ సతీష్ దగ్గర డబ్బు కొట్టేయాలని తన చిన్ననాటి స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. దీంతో నిందితులు నలుగురు గన్ తీసుకోని సతీష్ ఇంటికి వచ్చారు.
సతీష్ పై దాడి చేసి నోరు మూసి కట్టేసి బొమ్మ గన్ తో బెదిరించారు. అనంతరం ఇంట్లో ఉన్న రూ.1.18 లక్షల డబ్బును, ఫారెన్ కరెన్సీని, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, సిల్వర్ నెక్లెస్ దోపిడీ చేశారు. ఆ తర్వాత బళ్లారికి పారిపోయిన నేరస్థులు.. మళ్లీ దొంగతనం చేసేందుకు శంషాబాద్ కు వచ్చారు. నిందితులపై పోలీసులు నిఘా పెట్టరు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.26 లక్షల విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.