ఇందుది హత్య కాదు

Indu Death Case. దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారిది హత్య కాదని..

By Medi Samrat  Published on  19 Dec 2022 5:30 PM IST
ఇందుది హత్య కాదు

దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో మిస్టరీ వీడింది. చిన్నారిది హత్య కాదని.. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం అని పోలీసులు గుర్తించారు. బాలిక చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆడుకోవడనికి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన ఇందు ఎక్కడా సరైన ప్రదేశం లేకపోవడంతో టాయ్ లెట్ కోసం చెరువు దగ్గరికి వెళ్లిందని అక్కడ కాలు జారి చెరువులో పడిపోయినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చిన్నారి ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు వెళ్లడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు.

గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలింది. జవహర్‌నగర్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్‌ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతి చెందినట్లు పోస్టుమార్టమ్‌ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది.




Next Story