భారీ వర్షసూచన.. ఎల్లో అలెర్ట్ జారీ

IMD announces yellow alert for Hyderabad on Wednesday. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావ‌ర‌ణ శాఖ అధికారులు

By Medi Samrat  Published on  3 Aug 2022 11:12 AM GMT
భారీ వర్షసూచన.. ఎల్లో అలెర్ట్ జారీ

బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన జిల్లాల జాబితాలో రంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్దిపేట ఉన్నాయి. ఈ జిల్లాల‌లో భారీ వర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నగరంలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయి.. చెట్లు కూలే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ అంచనా వేసింది.


Next Story