హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని వెంకటరమణ కాలనీలో సర్వే మొదలెట్టనుంది. సర్వే నంబర్లు 152, 153లో ఎంత భూమిని ఆక్రమణకు గురైంది అనేదానిపై సమగ్ర తనిఖీని నిర్వహించనుంది. కాలనీ వాసులు పలు ఫిర్యాదుల మేరకు హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
హైడ్రా నిర్వహించిన ప్రాథమిక సర్వే ప్రకారం, ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గోల్డెన్ కీ వెంచర్స్ ఆస్తులను అటాచ్ చేసింది. ఈ సంస్థ వెంకటేశ్వర కాలనీలోని రోడ్లు, ప్లాట్లు, పార్కులను ఆక్రమించిందనే ఆరోపణలు ఉన్నాయి. గోల్డెన్ కీ వెంచర్స్, ఇతర భూ కబ్జాదారులు తమ ఆక్రమణలను కప్పిపుచ్చడానికి నివాసితులలో భయాందోళనలు సృష్టించే తప్పుడు సమాచారంపై అమీన్‌పూర్ నివాసితులను హైడ్రా హెచ్చరించింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్, చక్రపురి కాలనీ నివాసితులు సమగ్ర సంయుక్త సర్వే కోసం తమ ప్రాంతాల్లోని ఆక్రమణలపై ఏజెన్సీని సంప్రదించాలని హైడ్రా కోరింది.