హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

By Medi Samrat
Published on : 29 March 2025 4:45 PM IST

హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య

హైదరాబాద్‌లో టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంవత్సరం క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో పింకి కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Next Story