భారీ వర్షం.. తడిసిముద్దయిన భాగ్య నగరం

Hyderabad to witness heavy rains for next two hours. ఆదివారం మధ్యాహ్నం, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి,

By Medi Samrat  Published on  19 Jun 2022 4:51 PM IST
భారీ వర్షం.. తడిసిముద్దయిన భాగ్య నగరం

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, బీహెచ్‌ఈఎల్, రామాంతపూర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. అంత‌కుముందు మరో రెండు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. "దాదాపు అన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు భారీ వర్షాలు కురుస్తాయి" అని వాతావరణ నిపుణుడు తెలంగాణ వెదర్‌మ్యాన్ ట్విట‌ర్ హ్యాండిల్ ద్వారా పేర్కొన్నారు. భారీ వర్షం కురవడంతో రహదారిపైకి చేరిన మురుగు నీరు వ‌చ్చి చేరింది. న‌గ‌రంలోని ప‌లు లోతట్టు ప్రాంతాలు జలమయమ‌య్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహ‌న‌దారులు తీవ్రఇబ్బందులు ప‌డ్డారు.

హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ పత్రికా ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు గంటల్లో జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, వికారాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వ‌ర్షం కుర‌వ‌నున్న‌ట్టు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పత్రికా ప్రకటన విడుదల చేశారు.






















Next Story