హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్ చేసి బంధించి కారులో తరలిస్తుండగా ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లు సురేందర్ బంధువుల నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురేంద్రను రక్షించారు పోలీసులు. రాయదుర్గం నుంచి కిడ్నాపర్లు కారులో నల్లమల అడవులకు తీసుకెళ్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో బాధితుడిని వదలి కిడ్నాపర్లు పరారయ్యారు. వారి కోసం నల్లమలలో పోలీసులు గాలిస్తున్నారు.
సురేందర్ రోజులాగే శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లిగా.. లుంబినీ పెట్రోల్ బంక్ ముందు ఆగిన అతన్ని కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సురేందర్ భార్యకు ఫోన్ చేసిన కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సురేందర్ భార్య రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు సురేందర్ ను కాపాడారు.