హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరోసారి బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ఒకేసారి మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. శంషాబాద్‌కు వచ్చిన మూడు విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు మెయిల్‌తో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.
కెరళ కన్నుర్ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో ఎయిర్ లైన్స్ (6e7178), ఫ్రాంక్ ఫాంట్ నుండి హైదరాబాద్ వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ (LH-752), లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్ చేశారు.
ప్రయాణికులను కిందికి దింపి ఐసోలేషన్ కు తరలించారు. ముడు విమానాలను బాంబు స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఇటీవల కూడా వరుస శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వరుస బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ వరుస ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.