ఆటోవాలా 'DISTAB' కొటేషన్.. హైదరాబాద్ పోలీసులు కూడా వాడేశారు
Hyderabad Police Use Auto Driver Quotation. ఆటోలపై కొన్ని కొటేషన్లు కొన్ని సార్లు జీవిత సత్యాన్ని భోదిస్తూ ఉంటాయి. మరికొన్ని
By - Medi Samrat |
ఆటోలపై కొన్ని కొటేషన్లు కొన్ని సార్లు జీవిత సత్యాన్ని భోదిస్తూ ఉంటాయి. మరికొన్ని ఎంతో ఫన్నీగా కూడా ఉంటాయి. అలాంటి కొటేషన్స్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. వాటిని వాడుకుని ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఆటో మీద ఉన్న కొటేషన్ ను హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా వాడేశారు. 'DOT DISTAB I AM MARRIEAD I AM ALL READY VERY DISTAB' అనే కొటేషన్ ఉన్న ఆటో బ్యాక్ సైడ్ ను పోస్ట్ చేసిన హైదరాబాద్ సిటీ పోలీసులు దానితో పాటూ 'Do Not HonkSpeaker with cancellation strokeUnnecessarily, It will Distab* #Hyderabad #honking' అనే కోట్ ను పెట్టారు. అనవసరంగా హారన్ కొట్టడం వలన ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ పోలీసులు ఇలా హెచ్చరించారు.
Do Not Honk🔇Unnecessarily, It will Distab* #Hyderabad #honking pic.twitter.com/ML26oMgVR5
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 29, 2021
కొద్దిరోజుల కిందట కూడా 'అయ్యయ్యో వద్దమ్మా' అనే మీమ్ ను కూడా హైదరాబాద్ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ వాడేసింది. సైబర్ మోసాలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుఖీభవ స్టైల్‌లో హెచ్చరిస్తూ ఓ మీమ్‌ను ట్వీట్ చేశారు. ఎలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దని తెలంగాణ పోలీస్- సైబర్ క్రైమ్ అవగాహన కల్పిస్తూ సాధారణంగా ట్వీట్ చేసినప్పటికీ ఇదే విషయాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ టీమ్ 'సుఖీభవ'తో వైరల్ అయ్యేలా చేసింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ''సుఖీభవ.. సుఖీభవ.'' మీమ్ వైరల్ అవుతోంది. ఓ 'టీ' యాడ్‌లో బామ్మ ఒకరికి టీ ఇచ్చినందుకు గానూ ఆశీర్వదిస్తూ చెప్పే మాటే 'సుఖీభవ'. దాన్నే ఆ తర్వాత కొన్ని సంఘటనల కారణంగా వైరల్ చేసారు.