2 నిమిషాలు మౌనం.. అమరవీరులకు నివాళి..
Hyderabad Police Tribute to the Martyrs. జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి
By Medi Samrat
జనవరి 30 అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు ఎక్కడివారు అక్కడే మౌనం పాటించారు. హైదరాబాద్ అసెంబ్లీ కూడలి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు.. సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళి అర్పించారు. 2 నిమిషాలు ట్రాఫిక్ సిగ్నల్ ను కూడా నిలిపివేశారు. సిగ్నల్స్ వద్ద వాహనదారులు సైతం 2 నిమిషాలు మౌనం పాటించారు.
మరోవైపు.. మహాత్మా గాంధీ వర్ధంతి నేపథ్యంలో నగరంలోని బాపు ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్ముడి విగ్రహాం వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఉన్నారు.
గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.