సైలెన్స్‌ అయిన 'డుగ్గు డుగ్గు డుగ్గు' బండ్లు

Hyderabad Police Seized Customized Bullet Bike Silencers. బుల్లెట్ బండి.. ఈ బైక్‌కు ఉండే క్రేజే వేరు. మ‌ధ్య వ‌య‌సు స‌హా యువ‌త‌లో ఈ బండికి

By Medi Samrat  Published on  19 Oct 2021 12:39 PM GMT
సైలెన్స్‌ అయిన డుగ్గు డుగ్గు డుగ్గు బండ్లు

బుల్లెట్ బండి.. ఈ బైక్‌కు ఉండే క్రేజే వేరు. మ‌ధ్య వ‌య‌సు స‌హా యువ‌త‌లో ఈ బండికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. బండి ఎక్కి రోడ్డుపై వెళ్తుంటే ఆ రాయాల్టీ వేరు. బైక్ సౌండ్‌కు ఫిధా కానీ నాధుడు ఉండ‌డు. ఇంత‌టి క్రేజ్ ఉన్న ఈ బండిపై వ‌చ్చిన పాట‌లు కూడా విప‌రీత‌మైన హిట్ అయ్యాయి. ఆ మ‌ధ్య వ‌చ్చిన జార్జిరెడ్డి సినిమాలో 'వాడు న‌డిపే మండి రాయ‌ల్ ఇన్‌ఫీల్డ్‌', మొన్నీమ‌ధ్య వ‌చ్చిన 'బుల్లెట్టు బండి' పాట వ‌ర‌కూ మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. పాట ఎంత హిట్ అయినా.. బైక్ కు ఎంత క్రేజ్ ఉన్నా ఈ 'డుగ్గు డుగ్గు డుగ్గు బండ్ల' తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అందుకు.. హైద‌రాబాద్ సిటీ పోలీసులు చేసిన ఓ ట్వీట్ కార‌ణం. ఎలా అంటే.. బుల్లెట్ బండి.. దాని సౌండ్‌పై ఉన్న మోజుతో చాలామంది ప్ర‌త్యేకంగా సైలెన్సర్‌లను త‌యారుచేయించి అమ‌ర్చుతున్నారు. దీంతో రోడ్డుమీద వెళ్తుంటే భారీ సౌండ్‌తో పాటు శబ్ధ కాలుష్యానికి కారణంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు వాటికి క‌ళ్లెం వేశారు. దీంతో ప్రత్యేకించి తయారు చేయించుకున్న వందలాది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బండ్ల సైలెన్సర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఒక్కచోట చేర్చిన పోలీసులు రోడ్డు రోలర్‌ సాయంతో తొక్కించేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను హైదరాబాద్‌ పోలీస్‌ ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేస్తూ.. డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్‌ ఇప్పుడు సైలెన్స్‌ అయిపోయాయని రాసుకొచ్చారు.



Next Story