రూ.26,000 వేతనంతో ప్రత్యేక పోలీసు అధికారి ఉద్యోగం

రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పీవో) నియామకానికి హైదరాబాద్ సిటీ పోలీస్ దరఖాస్తులను ఆహ్వానించింది

By Medi Samrat  Published on  22 Jan 2024 6:33 PM IST
రూ.26,000 వేతనంతో ప్రత్యేక పోలీసు అధికారి ఉద్యోగం

రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక ప్రాతిపదికన ప్రత్యేక పోలీసు అధికారుల (ఎస్‌పీవో) నియామకానికి హైదరాబాద్ సిటీ పోలీస్ దరఖాస్తులను ఆహ్వానించింది. 61 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మాజీ సైనికులు, మాజీ పారామిలటరీ బలగాలు, పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బంది ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో మొత్తం 150 ఖాళీలను పూరించనున్నారు. నెలకు రూ. 26,000 వేతనం ఇవ్వనున్నారు. ఎలాంటి సెలవులు ఇవ్వరు.

ఆసక్తి గల అభ్యర్థులు హైదరాబాద్‌లోని పెట్లబుర్జ్‌లోని CAR ప్రధాన కార్యాలయంలోని SPO ఆఫీసును సందర్శించాలి.

ఒరిజినల్- జిరాక్స్ రెండింటినీ తీసుకెళ్లాల్సిన పత్రాలు:

(i) డిశ్చార్జ్ బుక్ / డిశ్చార్జ్ సర్టిఫికేట్ / రిటైర్మెంట్ ఆర్డర్.

(ii) ఆధార్ కార్డ్ & పాన్ కార్డ్.

(iii) వర్తిస్తే టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్.

(iv) డ్రైవర్ అభ్యర్థులకు మాత్రమే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ LMV / HMV.

(v) మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

Next Story