ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు

Hyderabad Police crackdown on trolls targeting public representatives. ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసినట్

By Medi Samrat  Published on  29 March 2023 2:15 PM GMT
ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు

Hyderabad Police crackdown on trolls targeting public representatives


ప్రజా ప్రతినిధులపై సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధుల పై అసత్య ప్రచారం చేస్తూ.. ట్రోల్ చేస్తున్న వారిపై కేసులు న‌మోదు చేసామ‌ని వెల్ల‌డించారు. మహిళలను కించపరిచే విధంగా ప‌లువురు సోషల్ మీడియాలో ట్రోలింగ్ పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవితపై ఈ మధ్య ఎక్కువ ట్రోలింగ్ జరిగాయని గుర్తించామ‌న్నారు.ఎమ్మెల్సీ కవితను కించపరిచే విధంగా, అభ్యూస్, వల్గర్ గా ట్రోల్ చేశారని పేర్కొన్నారు.

దీంతో పాటు మహిళాలపై అత్యధికంగా.. ట్రోల్స్ జరుగుతున్నాయని గుర్తించిన‌ట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంత మంది ప్రజా ప్రతినిధుల పై ట్రోల్స్ జరుగుతున్నాయన్నారు. టీఆర్పీ, సబ్‌స్క్రైబ‌ర్స్‌, వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని.. ఎక్కువ మంది యువత ఈ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారని వెల్ల‌డించారు. ఇప్పటికే 20 మందిపై కేసులు నమోదు చేసి.. 8 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.


Next Story