కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్

కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) తెలియజేస్తోంది. మొత్తం మూడు మెట్రో కారిడార్లలో అన్ని చార్జీలపై 2025 మే 24 నుంచి ఈ డిస్కౌంటు అమల్లోకి వస్తుంది

By Medi Samrat
Published on : 20 May 2025 2:53 PM IST

కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్

కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు అందించనున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) తెలియజేస్తోంది. మొత్తం మూడు మెట్రో కారిడార్లలో అన్ని చార్జీలపై 2025 మే 24 నుంచి ఈ డిస్కౌంటు అమల్లోకి వస్తుంది. నిలకడగా కార్యకలాపాల నిర్వహణపై దృష్టి పెడుతూ, ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో ముందుండటంలో L&TMRHLకి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సుల మేరకు, అలాగే దీర్ఘకాలంలో మెట్రో కార్యకలాపాలను సుస్థిరంగా నిర్వహించుకోగలిగేందుకు ఉద్దేశించిన సమగ్ర వ్యూహంలో భాగంగా చార్జీలు సవరించబడ్డాయి. ఆర్థికంగా దూరదృష్టితో వ్యవహరిస్తూ, ప్రయాణికులకు అందుబాటు స్థాయిలో సేవలు అందించాలన్న సంస్థ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఎంతో ఆలోచించిన మీదట సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

“బాధ్యతాయుతమైన పట్టణ ప్రాంత ట్రాన్సిట్ ఆపరేటరుగా, హైదరాబాద్‌వాసులకు సమర్ధవంతమైన, అందుబాటు స్థాయిలో మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించేందుకు L&TMRHL కట్టుబడి ఉంది. మెట్రో కార్యకలాపాలను నిలకడగా కొనసాగించేందుకు చార్జీలను సవరించక తప్పలేదు. అయినప్పటికీ మా అమూల్యమైన ప్రయాణికులపై ఆర్థిక భారం పడనివ్వకుండా చూడాలనే అంశానికి మేము అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ఇందులో భాగంగానే, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ మరియు వారి వెసులుబాటు మేరకు కొత్తగా సవరించిన చార్జీలపై 10 శాతం డిస్కౌంటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. అందుబాటు చార్జీల్లో రోజువారీ ప్రయాణాలకు వీలు కల్పించాలన్న మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 2025 మే 24 నుంచి మొత్తం మూడు మెట్రో కారిడార్లలోని అన్ని చార్జీల జోన్లవ్యాప్తంగా ఈ డిస్కౌంటు అమల్లోకి వస్తుంది. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రయాణికులకు కృతజ్ఞతలు. ప్రయాణికులకు విశ్వసనీయమైన, అనువైన మెట్రో అనుభూతిని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామని హామీనిస్తున్నాం” అని L&TMRHL ఎండీ & సీఈవో Mr. కేవీబీ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌వాసులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటు స్థాయిలో మెట్రో సేవలు అందించాలనే లక్ష్యానికి L&TMRHL కట్టుబడి ఉందని పేర్కొంది. సవరించిన చార్జీలు, ఇతర అప్‌డేట్‌ల కోసం సమగ్ర సమాచారం కోసం ప్రయాణికులు మా అధికారిక వెబ్‌సైట్ www.ltmetro.comను సందర్శించగలరు.

Next Story