ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైల్ టైమింగ్ పొడిగింపు

ఈరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సేవ‌ల సమయాన్ని పొడిగించింది

By Medi Samrat  Published on  8 May 2024 2:32 PM IST
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైల్ టైమింగ్ పొడిగింపు

ఈరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ సేవ‌ల సమయాన్ని పొడిగించింది. సాధారణ రోజుల‌లో ముగింపు స‌మ‌యం కంటే ఈ రోజు ఎక్కువ సేపు మెట్రో రైలు సేవ‌లు అందుబాటులో ఉంటాయి. చివరి మెట్రో రైలు 12:15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటంద‌ని అధికారులు తెలిపారు. ఉప్పల్ స్టేడియం, ఎంజీఆర్ ఐ స్టేషన్స్ లో ఎంట్రీ, మిగతా స్టేషన్స్ లో ఎగ్జిట్ మాత్రమే ఉండనుంది. ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చే అభిమానూలు మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇదిలావుంటే.. నిన్న న‌గ‌రంలో భారీ వ‌ర్షం కుర‌వ‌గా.. హైద్రాబాద్ లో ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ జ‌రుగుందా లేదా అనే విష‌య‌మై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు SRH, LSG జ‌ట్ల‌ మధ్య IPL మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్తయ్యాయి.

Next Story