పిచ్చి పీక్స్‌.. లైక్‌ల కోసం బ‌తికున్న పామును తినేశాడు

Hyderabad man ate snake.ఇటీవ‌ల కాలంలో యువ‌త‌కు సోష‌ల్ మీడియా పిచ్చి ప‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 6:54 AM GMT
పిచ్చి పీక్స్‌.. లైక్‌ల కోసం బ‌తికున్న పామును తినేశాడు

ఇటీవ‌ల కాలంలో యువ‌త‌కు సోష‌ల్ మీడియా పిచ్చి ప‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాలో లైక్స్‌, కామెంట్లు సాధించి అందులో సెలబ్రెటీగా ఉండేందుకు ఏం చేయ‌డానికైనా వెన‌కాడం లేదు. రాత్రికి రాత్రి పేరు తెచ్చుకునేందుకు వికృత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా.. ఓ యువకుడు సోషల్ మీడియాలో లైకుల కోసం పామును కరకర నమిలేశాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో చోటుచేసుకుంది

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు.. 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ హైదరాబాద్‌ వెర్షన్‌' పేరుతో ఏకంగా బతికున్న పామునే తింటూ వీడియో తీసుకున్నాడు. తొలుత పాముపిల్ల తలను నోట్లో పెట్టుకున్న యువకుడు.. కొంచెంకొంచెంగా తోక చివరి వరకు నమిలి మింగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో ఇపుడు వైరల్‌గా మారింది. కాగా.. పాము త‌న ప్రాణాలు కాపాడుకునేందుకు గిల‌గిల కొట్టుకుంది. 'అరేయ్‌ సాజిద్‌.. నీళ్ల బాటిల్‌ తీసుకురా..!' అంటూ ఆ యువకుడు మిత్రులను ఆదేశించడం ఆ వీడియోలో వినిపిస్తోంది.

దీనిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. స‌ద‌రు యువ‌కుడిని ప‌ట్టుకుని వెంట‌నే శిక్షించాల‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌కు ట్విట్ట‌ర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story