జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
By - అంజి |
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు మెల్ల మెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కాగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. 58 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతిత ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.
ఈ ఉప ఎన్నికలో ఓటర్లు ఇచ్చే తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆన్‌లైన్‌లో ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేస్తారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ అధికారి ఈ ప్రక్రియను చేస్తారు. పోలింగ్ బూత్‌లోకి సెల్‌ఫోన్లను అనుమతించరు. సెల్‌ఫోన్ల డిపాజిట్ కోసం ప్రత్యేక కౌంటర్ ఉంటుంది.
- బరిలో 58 మంది అభ్యర్థులు
- 407 పోలింగ్ స్టేషన్లు
- మొత్తం 4,01,365 మంది ఓటర్లు
బిహార్‌లోనూ తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అనేది ఆస్తిగా మారింది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్లు లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.