ఓ వైపు యుద్ధం.. మ‌రోవైపు ఉక్రెయిన్ అమ్మాయితో వివాహం

Hyderabad Groom Ukrainian Bride Tie Knot In True Filmi Style. హైదరాబాదీ యువకుడు ఉక్రెయిన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన

By Medi Samrat  Published on  1 March 2022 1:19 PM GMT
ఓ వైపు యుద్ధం.. మ‌రోవైపు ఉక్రెయిన్ అమ్మాయితో వివాహం

హైదరాబాదీ యువకుడు ఉక్రెయిన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్‌కి ఉక్రెయిన్‌కు చెందిన లియుబోవ్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రతీక్, లియుబోవ్ ఉక్రెయిన్‌లో వివాహం చేసుకున్నారు. రిసెప్షన్‌ను నిర్వహించడానికి భారతదేశానికి వచ్చారు. వారు భారత్ లో దిగిన ఒక రోజు తర్వాత యుద్ధం ప్రారంభమైంది. మల్లికార్జునరావు, పద్మజ దంపతుల కుమారుడు వరుడు ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పూర్వ విద్యార్థి. లియుబోవ్ హైదరాబాద్ చేరుకుని వివాహ పనుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. రిసెప్షన్ లో వధూవరులను ఆశీర్వదించేందుకు చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి హైదరాబాద్ కు వచ్చారు. ఆయన ఆ జంటను ఆశీర్వదించారు.


Next Story