రూ .8000 లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన టాక్స్ ఆఫీసర్‌..!

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో ఉండి రూ. 8000 లంచం డిమాండ్ చేసినందుకు తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు ఆమెను అరెస్టు చేశారు.

By Medi Samrat
Published on : 8 July 2025 9:15 PM IST

రూ .8000 లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన టాక్స్ ఆఫీసర్‌..!

హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి విధి నిర్వహణలో ఉండి రూ. 8000 లంచం డిమాండ్ చేసినందుకు తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు ఆమెను అరెస్టు చేశారు. మాదాపూర్‌లో డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎం.సుధ, ఫిర్యాదుదారుడి కంపెనీకి GST రిజిస్ట్రేషన్‌ను ప్రాసెస్ చేయడానికి, GST నంబర్‌ను జారీ చేయడానికి లంచం డబ్బును డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఆమె రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.


Next Story