ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం : సీపీ స‌జ్జ‌నార్

బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమ‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు.

By -  Medi Samrat
Published on : 29 Jan 2026 6:37 PM IST

ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం : సీపీ స‌జ్జ‌నార్

బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమ‌ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ ఎక్స్ వేదిక‌గా పేర్కొన్నారు. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండని సూచించారు. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం.. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండని కోరారు. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండని సూచించారు. నిశ్చింతగా ఉండండి.. మీ భద్రతే మా బాధ్యత అంటూ భ‌రోసా ఇచ్చారు.

Next Story