బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం.. స్పందించిన సాయి రాజేష్
ఇటీవల విడుదలైన బేబీ సినిమాపై హైదరాబాద్ సిపి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 14 Sept 2023 8:56 PM ISTఇటీవల విడుదలైన బేబీ సినిమాపై హైదరాబాద్ సిపి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలను పూర్తిగా రూపుమాపేందుకు కృషి చేస్తూ ఉంటే.. మరోవైపు డ్రగ్స్ ను ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో మేము రైడ్ చేసినప్పుడు ఉన్న సన్నివేశాలు బేబీ సినిమాలో ఉన్నాయి. ఆ సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టి కనీసం కాషాన్ లైన్ వేయకుండా డైరెక్ట్ గా ప్లే చేసిన సినిమా యూనిట్ పై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మళ్లీ మేము సినిమా యూనిట్ ను హెచ్చరిస్తే కాషాన్ లైన్ వేసారని సీపీ అన్నారు. డ్రగ్స్ ను ప్రోత్సహించే విధంగా ఉన్న బేబీ సినిమా ప్రొడ్యూసర్, సినిమా టీంకి అడ్వయిజరీ నోటీసులు ఇచ్చామని సీపీ తెలిపారు. ఇకపై అన్ని సినిమాలపై ఫోకస్ పెడతామని.. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ విషయమై బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ నీలం స్పందించారు. బేబీ టీంకు సీపీ కార్యాలయం నుండి కాల్ వచ్చిందని తెలిపారు. బేబీ సినిమాలో డ్రగ్ యూసేజ్ పై క్లారిటీ గురించి అడ్వయిజరీ నోటీస్ ఇచ్చారని తెలిపారు. మా టీం పై బాధ్యత ఉందని.. బెస్ట్ ఫ్రెండ్.. బ్యాడ్ ఫ్రెండ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బేబీ సినిమాలో ఆ సన్నివేశం తీశామన్నారు. అంతే తప్ప డ్రగ్స్ ను ప్రోత్సహించే విధంగా మేము సినిమా తీయలేదని క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు తీయొద్దని తోటి డైరెక్టర్ లను కూడా కోరారు.