హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటి సరఫరాలో 36 గంటలపాటు అంతరాయాన్ని ఎదుర్కొనున్నారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (ఫేజ్ I)లో భారీ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా అంతరాయం ఏర్పడనుంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) డిసెంబర్ 27, శనివారం ఉదయం 6 గంటల నుండి అంతరాయం కలిగే పలు ప్రాంతాలను గుర్తించింది. వీటిలో ఇవి ఉన్నాయి..
మీర్ ఆలం, కిషన్‌బాగ్, బాల్‌శెట్టి కట్ట, మొగల్‌పురా, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, జహనుమా, మహబూబ్ మాన్షన్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, బోగులకుంట, నారాయణగూడ, అడిక్‌మెట్ రిజర్వాయర్, శివమ్‌మెట్ రిజర్వాయర్, రిజర్వాయర్, రియాసత్ నగర్ రిజర్వాయర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని భాగాలు, హార్డ్‌వేర్ పార్క్, జల్పల్లి, తుక్కుగూడ, FAB సిటీ , మన్నెగూడ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
డిసెంబరు 28 ఆదివారం సాయంత్రం 6 గంటలకు సాధారణ తాగునీటి సరఫరా పునఃప్రారంభం కానుంది. ఈ 36 గంటల గడువులో సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో అధికారులు కొన్ని సూచనలు చేశారు. అంతరాయం కలగడానికి ముందే ఇంటి అవసరాలకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని.. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నివసించే వారు సంపులను నింపుకోవడం మంచిదన్నారు.