హైదరాబాద్ లో 'నాన్ కింగ్'.. సూపర్ క్వాలిటీనే ట్రేడ్ మార్క్

How Nanking traditional chinese origins captured hyderabad appetite. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన 1940లలో, దక్షిణ చైనాలోని హక్కా కమ్యూనిటీకి చెందిన లియు ముంబైకి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 July 2023 1:11 PM GMT
హైదరాబాద్ లో నాన్ కింగ్.. సూపర్ క్వాలిటీనే ట్రేడ్ మార్క్

రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన 1940లలో, దక్షిణ చైనాలోని హక్కా కమ్యూనిటీకి చెందిన లియు ముంబైకి వచ్చి చైనీస్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. యుద్ధం ముగిసిన కొన్ని సంవత్సరాల తర్వాత, రెస్టారెంట్ మూసివేశారు. లియు చనిపోయాడు.

తన స్వంత రెస్టారెంట్‌ను ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో, అతని చిన్న కుమారుడు KY లియు, కోడలు HS జంగ్ 1957లో హైదరాబాద్ వచ్చారు. KY లియు అప్పట్లో హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క చైనీస్ రెస్టారెంట్‌లో (ఇప్పుడు ఉనికిలో లేదు) ఉద్యోగంలో చేరారు. సికింద్రాబాద్‌లోని పార్క్ లేన్‌ లో ఒకప్పుడు ఉన్న పీకింగ్‌ రెస్టారెంట్ కు దగ్గరలో తన సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ రెస్టారెంట్ పేరే నాంకింగ్(నాన్ కింగ్) .

నాంకింగ్, 65 సంవత్సరాల తర్వాత కూడా తన పేరును, పాపులారిటీని అలాగే నిలుపుకుంది. నాలుగు తరాలకు చెందిన విశ్వసనీయమైన కస్టమర్‌ లు ఈ రెస్టారెంట్ కలిగి ఉంది. ఎక్కువ సమయం ఫుల్ ఆక్యుపెన్సీతో ఉంటుంది. పీక్ టైమ్ లో తినాలంటే టేబుల్ కోసం చాలా సేపు వేచి ఉండాలి.

సంప్రదాయాలను పాటిస్తున్నారు:

ప్రస్తుత యజమాని 76 ఏళ్ల స్జెయువాన్ లియుతో NewsMeter మాట్లాడింది. ఆయన పబ్లిసిటీ అంటే చాలు.. సిగ్గుపడే వ్యక్తి, తమ వంటలలో నాణ్యత ఉంటే చాలు అని ఆయన నమ్ముతారు. ప్రత్యేకంగా రెస్టారెంట్ కు ప్రచారం అవసరం లేదని నమ్ముతారు. కోల్‌కతాలో 5వ తరగతి వరకు చదివిన తర్వాత, లియు హైదరాబాద్‌లోనే తన పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు. రెస్టారెంట్ వ్యాపారంలో తన తల్లిదండ్రులతో చేరాడు.


అతని నలుగురు తోబుట్టువులు వెళ్ళిపోయినా.. లియు భారతదేశంలోనే ఉండి, కష్టపడి పని చేస్తూ, తన తండ్రి కలల రెస్టారెంట్‌ను చూసుకుంటూనే ఉన్నారు. తన ఆదర్శాలకు అనుగుణంగా, లియు అదే పాత ప్రామాణికమైన వంటకాలకు అందిస్తూ ఉన్నాడు. తగినంత పరిమాణంలో, మంచి నాణ్యత కలిగిన పరిశుభ్రమైన ఆహారం అందిస్తూ వస్తున్నారు.

"ప్రజలు తినడానికి ఖర్చు చేసే డబ్బుకు విలువ ఇవ్వాలని కోరుకునే నా తల్లిదండ్రుల మాదిరిగానే నేను కూడా కస్టమర్‌లు నాణ్యమైన ఆహారం, ఇచ్చే ఫుడ్ ఐటెమ్స్ పరిమాణంతో సంతృప్తి చెందాలని నమ్ముతాను. ఆహారాన్ని పరిశుభ్రంగా తయారుచేయడం ముఖ్యం. ఇక అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. మేము ప్రతి సంవత్సరం అధిక అద్దె చెల్లించవలసి వస్తోంది. మా సిబ్బందికి జీతాలు పెంచుతున్నాము. అయినా కూడా ఆహార ధరలను ఎక్కువగా పెంచకుండా.. సహేతుకంగా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. నా తల్లిదండ్రులు ప్రారంభించిన ప్రామాణికమైన మెనుకి కట్టుబడి ఉన్నాము. మేము మా అతిథుల అవసరాలకు అనుగుణంగా శాఖాహారం, సముద్రపు ఆహారం, చికెన్, పోర్క్ వంటివి అందిస్తాము. కాబట్టి, స్పైసీ, నాన్-స్పైసీ, మీడియం స్పైసీ, డ్రై, గ్రేవీ ఐటమ్‌లు వారి వారి ఎంపిక ప్రకారం పొందవచ్చు” అని లియు చెప్పారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో:

నాన్‌కింగ్‌లో క్రిస్పీ చికెన్, జింజర్ ప్రాన్, జింజర్ ఫిష్, రొయ్యల పకోరాలు అతిథులకు బాగా నచ్చుతాయి. “ఇవి మా నాన్నగారి సొంత వంటకాలు. వాటిని ఎలా ఉడికించాలో, వండాలో కూడా నాకు తెలుసు. మేము దానిని మా చెఫ్‌లకు నేర్పించాము. అనేక దశాబ్దాలుగా, నగరంలో మాది ఏకైక చైనీస్ రెస్టారెంట్. అందుకే వివిధ ఆసియా దేశాలు, ఐరోపా నుండి వచ్చే విదేశీ కస్టమర్లు మా రెస్టారెంట్ వైపు వస్తుంటారు" అని అన్నారు.

ప్రస్తుతం నాన్ కింగ్‌కు నాలుగు శాఖలు ఉన్నాయి. మొదటి హోటల్ పార్క్ లేన్‌లో, మరొకటి వెల్లింగ్‌టన్ రోడ్‌లో, పికెట్ వద్ద, మూడవది రోడ్ నంబర్ 2, బంజారాహిల్స్‌లో, కొత్తది AS రావు నగర్‌లో ఉంది. నిజాం కళాశాల సమీపంలో బ్లూ డైమండ్ అనే రెస్టారెంట్‌ను కూడా కలిగి ఉంది. మొత్తంగా, రెస్టారెంట్లలో ఒకేసారి 500 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం ఉంది. "అధికంగా స్థానికులే మా రెస్టారెంట్లలో వంటవారు, ప్రామాణికమైన వంటకాలను తయారు చేయడానికి శిక్షణ తీసుకుంటారు. మా దగ్గర దాదాపు 80 మంది సిబ్బంది ఉన్నారు. ఉద్యోగాలు కోరుతూ మా వద్దకు వచ్చే వారికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. 25 నుండి 30 సంవత్సరాలుగా మాతో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు, ”అని లియు చెప్పారు.


“మేము నూడుల్స్ వంటి కొన్ని పదార్థాలను తయారు చేస్తాము, అయితే కొన్ని సాస్‌లను కోల్‌కతాలోని టాంగ్రా ప్రాంతం నుండి తీసుకువస్తారు, అక్కడ చైనీస్ కమ్యూనిటీకి చెందిన ఫ్యాక్టరీలు ఉన్నాయి. మాకు పౌల్ట్రీ, హేచరీలు కూడా ఉన్నాయి. మేము రెస్టారెంట్‌ను ప్రతిరోజూ అందంగా అలంకరిస్తాము.”అని లియు చెప్పారు. లియు ముగ్గురు కొడుకులలో చిన్నవాడైన లియు కు చున్‌తో కలిసి వ్యాపారాన్ని నడుపుతున్నాడు.

చైనీస్ ఫుడ్‌కి ఆదరణకు గల కారణాల గురించి అడగ్గా “బహుశా, సాంప్రదాయ భోజనం తినడం అలవాటు చేసుకున్న వ్యక్తులు, ఒక్కోసారి రకరకాల రుచులను ఇష్టపడతారు. చైనీస్ ఆహారం కూడా చాలా ఆరోగ్యకరమైనది, తేలికైనది, తక్కువ కారంగా ఉంటుంది. ఎందుకంటే ఇది సుగంధ ద్రవ్యాలు, కొవ్వు నూనెలపై ఆధారపడకుండా ప్రధానంగా సాస్ ఆధారితంగా తయారు చేయొచ్చు. ఇది స్థానిక ప్రజల ఇష్టానికి తగ్గట్టుగా కూడా అందించడానికి వీలు అవుతుంది" అని లియు తెలిపారు.


Next Story