తండ్రి ముందే ఘోరం..హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు
హైదరాబాద్ కోకాపేట్ ప్రాంతంలో పోకిరీలు రెచ్చిపోయారు.
By - Knakam Karthik |
తండ్రి ముందే ఘోరం..హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పోకిరీలు
హైదరాబాద్ కోకాపేట్ ప్రాంతంలో పోకిరీలు రెచ్చిపోయారు. తన కూతురు, ఆమె స్నేహితులతో కలిసి బేకరీకి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తీవ్ర అవమానానికి, భయానికి గురి అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. బేకరీ వద్ద కారు పార్క్ చేసి కేక్ తీసుకొని తిరిగి కారులోకి వెళ్తుండగా, కొందరు యువకులు తమ కారును అడ్డంగా పెట్టి బాధితుడి కారును అడ్డగించారు.
అనంతరం తండ్రి ఎదుటే ఆయన కూతురితో పాటు ఆమె స్నేహితులపై అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిపై పోకిరీలు దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులు బూతులు తిడుతూ... నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరింపులకు దిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాదాపు ఆరు గంటల పాటు అక్కడే హంగామా సృష్టించడంతో బాధిత కుటుంబం నిస్సహాయ స్థితిలోకి వెళ్లింది. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.