హైదరాబాద్‌లో కొనసాగుతున్న హై అలర్ట్
ల్లీ బాంబు పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు.
By - Medi Samrat |
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరి కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాడికి వెనక ఎవరున్నారో తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది.
హైదరాబాద్‌లో హై అలర్ట్ కొనసాగుతుంది. నగరంలో పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకా కుండా టెంపుల్స్, షాపింగ్ మాల్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్‌లలో బాంబు స్క్వాడ్స్‌తో తనిఖీలు కొనసాగిస్తున్నారు.
బాలానగర్ పరిధిలోని పలు షాపింగ్ మాల్స్,టెంపుల్స్, బస్టాండ్‌లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంతేకాక నగరంలోని రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తులు లేదా అనుమానస్పదంగా ఏదైనా వస్తువులు గమనించినట్లైతే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనాలు ఎక్కువగా ఎక్కడ గుమిగూడి ఉండకూడదని పోలీసులు సూచించారు.