భారీ ట్రాఫిక్ జామ్.. రంగంలోకి దిగిన పోలీసులు

Heavy Traffic Jam In Hyderabad Due to Rain. హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ఇబ్బంది పెట్టింది.

By Medi Samrat  Published on  31 July 2023 3:36 PM GMT
భారీ ట్రాఫిక్ జామ్.. రంగంలోకి దిగిన పోలీసులు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం




హైదరాబాద్ నగరాన్ని వర్షం మరోసారి ఇబ్బంది పెట్టింది. సోమవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం పలు చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. నగరంలో చాలా చోట్ల వాన నీరు రోడ్ల పైన నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐటీ కారిడార్‌ అయిన సైబరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐకియా నుంచి జేఎన్‌టీయూ వరకు భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచి పోయింది. మరోవైపు నానక్‌రామ్‌ గూడ, బయో డైవర్సిటీ రూట్‌లోనూ వెహికిల్స్ స్లోగా ముందుకు కదులుతున్నాయి. కొండాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌ రూట్‌లలోనూ భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు ముందుకు కదలడం లేదు.

వర్షం కురవొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ట్రాఫిక్‌ జామ్‌ మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో పోలీసులు వాహనాల రద్దీని క్లీయర్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షం నేపథ్యంలో పలుచోట్లు రోడ్డు మీద నీరు నిలిచిపోయి. వాహనాలు పోయేందుకు వీలు లేకుండా అయింది.


Next Story