హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకూ ఉక్క‌పోత‌గా ఉన్న వాతావ‌ర‌ణం.. మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురిసింది

By Medi Samrat  Published on  15 Aug 2024 3:45 PM GMT
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురిసింది. సాయంత్రం వరకూ ఉక్క‌పోత‌గా ఉన్న వాతావ‌ర‌ణం.. మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొట్టంది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో భారీ వ‌ర్షం కురిసింది. అక‌స్మాత్తుగా కురిసిన‌ భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయ్యింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో.. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంత‌రాయం క‌లిగింది లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, సనత్ నగర్, బోరబండ, శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్ పల్లి, లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, అల్వాల్, పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్‌పూర్, మాదాపూర్, హైటెక్‌సిటీలో కూడా భారీ వ‌ర్షం కురిసింది. భారీగా వర్షం కార‌ణంగా రోడ్లపై వరద నీరు ఉప్పొంగుతోంది. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డిలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు.

Next Story