హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. లోతట్టు కాలనీల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ముంపు ప్రాంతంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. మ్యాన్ హోల్ ల వద్ద ప్రమాదం జరగకుండా చూసుకోవాలని సూచనలు చేశారు.
విద్యుత్ స్తంభాలు ,చెట్ల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. గంట తరువాత మరోసారి భారీ వర్షం కురుస్తుందనే సమాచారం నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుండి బయటకు రావద్దన్నారు. రెవెన్యూ, పోలీస్, ముస్సిపల్, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్ెండీఏ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. సమస్య ఉన్న చోటును గుర్తించి అక్కడికి డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే వెళ్ళాలని ఆదేశించారు.