ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు

Harish Rao Elected As Exhibition Society President. ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్

By Medi Samrat  Published on  21 Aug 2021 11:44 AM GMT
ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఎగ్జిబిషన్ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళ్తాన‌ని అన్నారు. ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు.

నా బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామన్నారు. ఇదిలావుంటే.. ఈటెల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌లో ఉండ‌గా సోసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈటెల‌ రాజీనామాతో ఖాళీ అయిన అధ్య‌క్షుడి స్థానాన్ని ప్ర‌స్తుతం హరీశ్ రావు చేప‌ట్టారు.







Next Story