అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ వేధింపులు.. పట్టుకున్న రాచకొండ పోలీసులు

Harassment by morphing photos of girl. మార్ఫింగ్‌ చేసిన నగ్న ఫోటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి క్లాస్‌మెట్‌ను వేధించిన

By Medi Samrat  Published on  9 March 2021 9:14 AM GMT
అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్‌ చేస్తూ వేధింపులు.. పట్టుకున్న రాచకొండ పోలీసులు

మార్ఫింగ్‌ చేసిన నగ్న ఫోటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి క్లాస్‌మెట్‌ను వేధించిన సైబర్‌ నేరగాడి ఆటలను బట్టబయలు చేశారు రాచకొండ పోలీసులు. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన మునగపాటి శివరామకృష్ణ తనతో పాటు ఇంజనీరింగ్‌ చదివిన క్లాస్‌మేట్‌ ఫోన్‌ నెంబర్‌ సేకరించాడు. ఇంకేముందు అతగాడు ఆమెతో పరిచయం పెంచుకుని వాట్సాప్‌ చాటింగ్‌ ప్రారంభించాడు. ఓ రోజు ఆమె ఫోటో మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన ఫోటోలు పంపాడు. న్యూడ్‌గా వీడియో కాల్‌ మాట్లాడకపోతే దానిని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించసాగాడు. బయపడిన ఆమె అతడు చెప్పినట్లే చేసింది. అప్పుడు స్క్రీన్‌ షాట్లు తీసుకున్నాడు. వీడియో సైతం రికార్డు చేశాడు. ఆ యువతి మరో యువకుడితో స్నేహంగా ఉండటం గమనించి నిలదీశాడు. అతడంటే ఇష్టమని చెప్పింది.

దీంతో శివరామకృష్ణ ఆమె ఫోటోలను సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్‌లోడ్‌ చేశాడు. ఆమె సెల్‌ నెంబర్‌ను పోస్టు చేశాడు. దీంతో పలువురు ఫోన్‌ చేసి ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఆమె రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఫోన్‌లో ఉన్న నగ్నచిత్రాలు, వీడియోలు డిలీట్‌ చేసి, పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు సాంకేతిక ఆధారంగా వీడియోలు, ఫోటోలు పోలీసులు తిరిగి రాబట్టడంతో నిందితుడు చేసిన తప్పు అంగీకరించాడు.

అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించిన పోకిరీలపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సోషల్‌ మీడియా ఉన్న అందమైన అమ్మాయిల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేస్తున్న కొందరు వాటిని అశ్లీలంగా మార్ఫింగ్‌ చేస్తున్నారు. వాటిని తిరిగి వారికే వ్యక్తిగతంగా పోస్టు చేస్తున్నారు. తాము చెప్పినట్లు చేయాలని, లేకుంటే మార్ఫింగ్‌ ఫొటోలను సోషల్‌మీడియా, సైట్లలో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే నగరానికి చెందిన ఓ బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.




Next Story