హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

Gun Fire At Hyderabad. హైదరాబాద్ న‌గ‌రం గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం

By Medi Samrat  Published on  14 July 2021 4:21 PM IST
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్ న‌గ‌రం గన్‌ఫౌండ్రీలోని ఎస్‌బీఐ కార్యాలయం ఆవరణలో కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సర్దార్‌ఖాన్ అనే వ్య‌క్తి జరిపిన కాల్పుల్లో కాంట్రాక్టు ఉద్యోగి సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. సెక్యూరిటీ గార్డు, కాంట్రాక్టు ఉద్యోగికి మధ్య పరస్పర వాగ్వాదం జ‌ర‌గ‌డంతో విచక్షణ కోల్పోయిన సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌.. కాంట్రాక్టు ఉద్యోగి పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story