హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై రాజాసింగ్ స్పందిస్తూ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ మరో యాభై ఏళ్లయినా అధికారంలోకి రాదు అని అన్నారు. దీనికి బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరే కారణం అని ఆరోపించారు. మేమున్నాం, బీజేపీకి ఓటు వేయండి అని జూబ్లీహిల్స్ ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారు? అని ప్రశ్నించారు.
మొండితనంతో ముందుకు వెళ్తే 50 సంవత్సరాలు కూడా కష్టమే, ఏ విధంగా ఓటర్లను మన వైపు మళ్లించుకోవాలో నేర్చుకోవాలి అని బీజేపీ నేతలకు సూచించారు. నేను ఏదైనా తప్పు చెప్తే క్షమించండి. కిషన్ రెడ్డి గారూ, తెలంగాణలో బీజేపీ చనిపోతుంది దయచేసి పార్టీని కాపాడండి అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.