వర్షం పడితే చాలు హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తూ చెరువులను తలపిస్తాయి. ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియని పరిస్థితి. వర్షం వస్తే చాలు కాలు బయటపెట్టలేని స్థితి. తాజాగా రోడ్ల పరిస్థితిపై టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
రాఘవేంద్ర సమాజం, కైతాలాపూర్, కూకట్‌పల్లి.. కేటీఆర్ గారు ఇది అనాథాశ్రమం (చీర్స్ ఫౌండేషన్) రహదారి. ఈ కాలనీలో 600 కుటుంబాలు నివసిస్తున్నారు. ఆ రహదారికి మీరు పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నాను. గ్రేటర్ తెలంగాణ దిశగా మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు అంటూ రోడ్డు పరిస్థితిని ట్వీట్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గోపిచంద్ ట్వీట్ వైరల్ అవుతుంది. ప్రజాసమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన గోపిచంద్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గోపిచంద్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించాల్సివుంది.