హైదరాబాద్‌ మహానగరంలో ఎంతో కాలంగా రాత్రుళ్లు, తెల్లవారుజామున సరైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లేక నగరవాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో మెట్రో రైలు సమయ వేళల్లో మార్పులు చేయాలంటూ మెట్రో అధికారులను నగరవాసులు కోరుతున్నారు. అయితే రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం ఆధారంగా తాము చర్యలు చేపడతామని మెట్రో రైలు అధికారులు చెప్తున్నారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ ట్వీటర్‌ ద్వారా స్పందించారు. అభినవ్‌ సుదర్శి అనే ప్రయాణికుడు చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు.

మార్నింగ్‌ టైంలో మెట్రో రైలు ఫ్లాట్‌ఫామ్‌ల దగ్గర రైళ్ల కోసం జనం రద్దీ, మహిళలు ఇబ్బందులు పడుతున్న వీడియోను తీసిన అభినవ్‌.. ఆ వీడియోను ట్వీటర్‌లో పెట్టి మంత్రి కేటీఆర్‌, కేటీఆర్‌ ఆఫీస్‌కు ట్యాగ్‌ చేశాడు. మార్నింగ్‌ టైంలో హైదరాబాద్‌ వచ్చే ప్రయాణికులకు సరైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లేక ఇబ్బందులు పడుతున్నారని, ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైళ్లు నడిపేలా చూడాలని ట్వీట్‌లో కోరాడు. అభినవ్‌ మాటలతో తాను ఏకీభవిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశాడు. మెట్రో రైలు ఎండీ స్పందించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్‌ సూచిస్తూ ఎన్‌విఎస్‌ రెడ్డికి ట్యాగ్‌ చేశారు. ఈ విషయంపై మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి సానుకూలంగా మంత్రికి సమాధానం ఇచ్చారు. మెట్ర సమయ వేళలపై అధికారిక సమాచారం త్వరలో వెలువడే ఛాన్స్‌ ఉంటుందన్నారు.


అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story