ఇక‌పై నెల నెలా ఆస్తి పన్ను వసూలు యోచ‌న‌లో జీహెచ్ఎంసీ..!

హైదరాబాద్‌లో ఆస్తిపన్ను వసూలు చేసే విధానంపై మార్పులు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిశీలిస్తోంది

By Medi Samrat  Published on  1 Oct 2024 3:00 PM IST
ఇక‌పై నెల నెలా ఆస్తి పన్ను వసూలు యోచ‌న‌లో జీహెచ్ఎంసీ..!

హైదరాబాద్‌లో ఆస్తిపన్ను వసూలు చేసే విధానంపై మార్పులు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఏడాదికి ఒక సారి, లేదా ఏడాదికి రెండు సార్లు ఆస్తి పన్ను చెల్లింపు వ్యవస్థ ఉండేది. అందుకు బదులుగా, GHMC నెలవారీ ఆస్తి పన్ను సేకరణ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తూ ఉంది. ప్రతిపాదిత విధానం ప్రకారం, హైదరాబాద్‌లో మొత్తం వార్షిక ఆస్తి పన్ను 12 సమాన వాయిదాలుగా విభజించనున్నారు. ఈ చర్య వల్ల పన్ను చెల్లింపుదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నారు.

"ఎర్లీ బర్డ్ స్కీమ్" ను తీసుకుని రావాలని కూడా GHMC భావిస్తోంది. వార్షిక పన్నులను ముందుగానే చెల్లించే ఆస్తి యజమానులకు ఐదు శాతం రాయితీని అందిస్తుంది. అంతేకాకుండా GHMC ఆలస్యంగా పన్ను డబ్బులు చెల్లించే వారిపై జరిమానాలు విధించే పనిలో కూడా ఉంది. నెలవారీ చెల్లింపుల విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story